For a better experience please change your browser to CHROME, FIREFOX, OPERA or Internet Explorer.

5న ఐటిఐ డిప్లొమా వారికి ఉద్యోగ మేళా

విశాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 5న ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఉపాధి కల్పన మిషన్ (సీడాప్), దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకంలో భాగంగా దువ్వాడ VSEZ లోని సినర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్ లో ఆపరేటర్, ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి ఈ ఇంటర్వ్యూలు చేపడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఐటిఐ డిప్లొమా (ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్, ఆటోమొబైల్ ట్రేడ్స్) అర్హతగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. సంస్థ కార్యాలయంలో పాసుపోర్టు సైజు ఫోటో, ఆధార్, రేషన్ కార్డులతో పాటు విద్యార్హతకు సంబందించిన సర్టిఫికెట్లతో హాజరు కావాల్సి ఉంటుంది.

పూర్తి వివరాలకు 88867 12299, 83099 22923 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.

Source: Sakshi News

leave your comment

Your email address will not be published. Required fields are marked *

Top Android App
Android App