మారనున్న విశాఖ సాగర తీర రూపు రేఖలు!
విశాఖ సాగర తీరంలో కోస్టల్ బాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు బీచ్ అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి GVMC పూనుకొంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నిధులు సమకూర్చనుంది. 116.71 కోట్లకు హైద్రాబాదుకు చెందిన స్టాండర్డ్ ఇన్ఫ్రా టెక్ అనే సంస్థకు GVMC అప్పగించింది. నెల రోజులపాటు బీచ్ లో సర్వే నిర్వహించిన అంతరం నిర్మాణ పనులకు ఆ సంస్థ శ్రీకారం చుట్టనుంది. మే 2022 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి సందర్శకులకు అందుబాటు లోకి తీసుకురావాలని సంకల్పించింది. తీరప్రాంత అభివృద్ధిలో భాగంగా 3.5 కి. మీ. మేర అనేక మార్పులు రానున్నాయి.

ఈ ప్రాజెక్టులో భాగంగా బీచ్ లో చేయనున్న అభివృద్ధి పనులు:
- 2.5 మీ. వెడల్పుతో 3.96 కి. మీ. మేర సైకిల్ ట్రాక్ రానుంది. ఈ ట్రాక్ కి ఆనుకుని సైకిల్ పార్కింగ్, రెండు సైకిల్ రెంటల్ షాపులు ఉంటాయి.
- 1.8 మీ. వెడల్పుతో 11,471 చ. మీ. మేర సైకిల్ ట్రాక్ పక్కనే ప్రత్యేక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు.
- 11 మీ. వెడల్పుతో రహదారితో పాటు పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. మొత్తం 3.5 కి. మీ. మేర 450 కార్లు పార్కింగ్ చేసేలా తీర్చిదిద్దనున్నారు.
- మూడు లైఫ్ గార్డ్ టవర్లు ఏర్పాటు చేయనున్నారు.
- 6.50 కి. మీ. మేర మురుగునీటి కాలువలు, 5 చోట్ల పబ్లిక్ రెస్ట్ రూములు నిర్మించనున్నారు.
- బీచ్ రోడ్డులో 8 చోట్ల వాటర్ ఎటిఎంలు అందుబాటులోకి రానున్నాయి.
- మూడు ప్రాంతాల్లో రిక్రియేషన్ పార్కులు, చిల్డ్రన్ పార్కులు, 6 యాంఫి థియేటర్లు నిర్మించనున్నారు.
- బీచ్ రోడ్డు వెంబడి ప్లాజాలు, బీచ్ యాక్సిస్ పాయింట్లు, సిట్ఔట్స్, 14 బస్ స్టాపులు ఏర్పాటు కానున్నాయి.
- ప్రస్తుతం వున్న దుకాణాల్ని కూడా అప్ గ్రేడ్ చేయనున్నారు.
- బీచ్ రోడ్డులో వున్న మహనీయుల విగ్రహాలు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా రిఅరెంజ్ చేస్తారు.
- మూడు మీటర్ల ఎత్తు వుండే 1322 చెట్లు, 97,392 పొదలు పెంచి ఆహ్లాదాన్ని పెంచనున్నారు.

News source: Sakshi News
leave your comment