మార్చి 2021 లో పట్టాలెక్కనున్న విశాఖ లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్!
విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మార్చిలో పట్టాలెక్కనుంది. లైట్ మెట్రో రైలు, మోడరన్ ట్రామ్ కారిడార్లకు సంబందించిన DPR ని అర్బన్ మాస్ ట్రాన్సిస్ట్ కంపెనీ కన్సల్టెన్సీ కంపెనీ తయారు చేసి నవంబర్ 11 న అందించనుంది. DPR ను ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత నవంబర్ చివర్లో టెండర్లు పిలిచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మర్చి 2021 నాటికి డెవలపర్ సెలక్షన్ తో పాటు అగ్రిమెంటుపై సంతకాలు చేయనున్నారు.

మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే లైన్లు, స్టేషన్లు, ఎట్ గ్రేడ్ పార్కింగ్ స్టేషన్లు, మల్టీ లెవెల్ కార్ పార్కింగు ప్రాజెక్టులు, రన్నింగ్ స్టేషన్లు హనుమంతవాక వద్ద మెయింటనెన్స్ డిపో నిర్మాణాలతో సహా వివిధ ఇతర అవసరాలకు కావాల్సిన స్థలాన్వేషణ దాదాపు పూర్తయింది. ఈ ప్రాజెక్టుకు మొదటి దశలో కావాల్సిన 118.7 ఎకరాల్లో ఇప్పటికే 105.84 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. ఇంకా 12.33 ఎకరాల ప్రైవేట్ భూమి సేకరణకు చర్చలు జరుపుతున్నారు.

మొత్తం 75.31 కి.మీ. ల మెట్రో మార్గంలో 46.40 కి.మీ. మేర మొదటి దశ నిర్మాణాన్ని 2025 మర్చి లోపు, 28.91 కి.మీ. మేర రెండవ దశ నిర్మాణాన్ని మర్చి 2028 లోగ పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసారు.
కారిడార్ | మార్గం | కి. మీ. | స్టేషన్లు |
కారిడార్ 1 | స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది | 34.23 | 27 |
కారిడార్ 2 | గురుద్వార నుంచి పాత పోస్టాఫీసు | 5.26 | 06 |
కారిడార్ 3 | తాటిచెట్లపాలెం నుంచి RK బీచ్ | 6.91 | 09 |
కారిడార్ 4 | కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు | 29.91 | 10 |
మొత్తం | —— | 75.31 | 52 |
మల్టీ లెవెల్ కార్ పార్కింగు రానున్న ప్రాంతాలు
- స్టీల్ ప్లాంట్ గేట్
- గాజువాక
- గురుద్వారా
- మద్దిలపాలెం
- బీవీకే కాలేజ్
- సంపత్ వినాయక టెంపుల్
News source: Sakshi daily news