విశాఖలో క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం
విశాఖలో పోర్టు అద్వర్యంలో క్రూయిజ్ టెర్మినల్ ను నిర్మించనున్నారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రతి మేజర్ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ నిమించాలని మూడేళ్ళ క్రిందట కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దానిని అనుసరించి గత ఏడాది క్రూయిజ్ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది.

దేశంలో ఇప్పటికే ముంబయి, కొచ్చి, చెన్నై, మంగుళూరు పోర్టుల్లో క్రూయిజ్ టెర్మినళ్ళు ఏర్పాటయ్యాయి. అక్కడ నుంచి నౌకలు రాకపోకలు సాగిస్తుండటంతో అక్కడ టూరిజం బాగా వృద్ధి చెందింది. విశాఖలోనే అదే రీతిలో అభివృద్ధి చేసేందుకు విశాఖ పోర్టు ట్రస్టు అడుగులు వేసింది. దీనికి రూ.77 కోట్లు ఖర్చవుతుందని నిర్ధారించారు. ఇందులో 50 శాతం నిధులను కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, మరో 50 శాతం టూరిజం శాఖ కేటాయించనుంది. మరికొద్ది నెలల్లో దీనికి సంబంధించిన పరిపాలన భవనాన్ని సిద్ధం చేస్తారు. 2021 చివరికల్లా నిర్మాణం పూర్తి కానున్నట్లు విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్ శ్రీ కె. రామ్మోహనరావు తెలిపారు.
నిర్మాణంలో భాగంగా అనేక సౌకర్యాలు కల్పించనున్నారు. దీనిని 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. 180 మీటర్ల క్రూయిజ్ బెర్తు నిర్మించనున్నారు. త్వరలోనే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
-News source sakshi.com